వారి సంక్షేమానికి రూ.100 కోట్లు.. త్వరలోనే ఎన్నారై పాలసీ.. కవిత

అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలు, గల్ఫ్ లాంటి దేశాల్లో తెలంగాణ వాసులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యపై, ఎన్నారైల సంక్షేమానికై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని నిజామాబాబ్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వారికోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని అన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే (లండన్) శాఖ ఎనిమిదో వార్షికోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్‌చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు…

Telugu news Rs 100 crore for their welfare .. NRI policy soon.. Kavitha.

‘ఎన్నారైలకు ఇక్కడి పార్టీకి వారధులుగా ఎన్నారై సెల్ పనిచేయాలి. అందరం కలిసి పనిచేస్తే దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు ప్రస్తుతం 33 దేశాల్లో విస్తరించాయి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో గులాబీ జెండా ఎగిరేలా కృషిచేస్తాం. విదేశాల్లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రొఫెసర్ జయశంకర్ సార్ వివరించారు. ఆయన సూచనలతో విదేశాల్లో ఉండే తెలంగాణ వాసులు వివిధ పేర్లతో సంఘాలు పెట్టుకుని పనిచేశారు. ఆ సమయంలో రకరకాలుగా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. నవ్విన నాప చేను పండిన చందంగా తెలంగాణ సాధించుకున్నాం.

మన ఇండస్ట్రియల్ పాలసీని చూసి అమెరికావాసులు ఇలాంటి పాలసీ తమ వద్ద లేదన్న విషయం తెలంగాణ బిడ్డలుగా మనకు గర్వకారణం’ అని తెలిపారు కవిత. అనంతరం టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు వార్షికోత్సవాలను లండన్‌లో జరుపుకున్నామన్నారు. పార్టీకి, సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. Telugu news Rs 100 crore for their welfare .. NRI policy soon.. Kavitha