mictv telugu

రూ.13 వేలు పలికిన అరుదైన చేప

January 10, 2019

సాధారణంగా చేపల రేట్లు కిలో రూ.150 నుంచి ప్రారంభిస్తే రూ.400 పై వరకు లభ్యమవుతున్నాయి. రకరకాల చేపలు, వాటి రకాలను బట్టి రేట్లు కడుతుంటారు. అలాంటి ఒక రకమైన చేప రూ.13,000లకు అమ్ముడుపోయింది. ఆశ్చర్యకర ఈ ఘటన పూణె జిల్లా ఇందాపూర్ తాలుకా బాభుల్ గావ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… బాభుల్ గావ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు స్థానిక ఉజానీ రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లారు. వారి వలకు ఓ అరుదైన జాతి చేప తగిలింది. అది అహెర్ జాతికి చెందిన చేప.Telugu news Rs 13 thousand auctioned fishకానీ వాళ్ళు దాన్ని సరిగ్గా గుర్తించలేదు. తీస్కెళ్లి ఓ వ్యాపారికి సాధారణ రేటుకే విక్రయించారు. ఆ వ్యాపారి చేపను ఇందాపుర్‌ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టాడు. మార్కెట్లో దాన్ని చూసిన జనం కొనడానికి పోటీలు పడ్డారు. దీంతో ఆ వ్యాపారి ఆ చేపకు వేలం పాట పెట్టాడు. రూ. 2,000 నుంచి వేలం పాట ప్రారంభమై రూ.13,000కు ముగిసింది. దీంతో వ్యాపారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలాంటి చేప రోజుకొకటి దొరికినా చాలనుకున్నాడట. మరి ఈ చేపలోని ప్రత్యేకతలు ఏంటంటే.. దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, పలు ఔషధ గుణాలు కూడా వున్నట్లు చెబుతుంటారు. ఈ రకం చేపలు మార్కెట్‌లోకి వచ్చినప్పుడల్లా జనం ఎగబడి కొంటుంటారు.

ఇలాంటివే కొన్ని ఘటనలు జపాన్‌లోనూ జరిగాయి. 278 కిలోల బ్లూఫిన్ టూనా జాతికి చెందిన చేపను వేలం వేయగా రూ. 21 కోట్లకు కొన్నారు. మరోసారి కేవలం 101 సెంటీమీటర్ల లెజెండ్ అనే చేప రూ.12.6 కోట్లకు అమ్ముడుపోయింది.