35 వేలకు కొనుక్కుని రేప్, హత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

35 వేలకు కొనుక్కుని రేప్, హత్య..

April 21, 2018

ఇంతకన్నా ఘోరం ఈ ప్రపంచంలో వేరేది వుండదు. సూరత్‌లో 11 ఏళ్ళ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు విషయాలు రాబట్టారు. అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు.

మార్చి 15న అంగట్లో పశువుల్ని కొన్నట్టు రాజస్థాన్‌లోని గంగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఓ వితంతు మహిళను, ఆమె కుమార్తెను నూ. 35లకు కొన్నాడు. ఇంట్లో చాకిరీ చేయించుకునే నెపంతో వారిని కొన్నట్టు తేలింది. కొన్నవాళ్ళు తమతో పాచి పనులు చేయించుకుని సమయానికి ఇంత అన్నం పెడతారని భావించింది ఆ తల్లి. కానీ వాళ్ళ ఉద్దేశం అదికాదు.. వారితో పాడుపని చేయాలని భావించారు. హర్సయాయి తన మూడంతస్తుల భవనంలో మహిళను, ఆమె 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశారు. అయితే తన కుమార్తెపై అత్యాచారం చేయడాన్ని అడ్డుకున్నందుకు తల్లిని చంపాలని హర్సయాయి భావించాడు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన గంగాపూర్‌కు చెందిన హర్సయాయి (35)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడు హరిసిన్హ్, మరో ఇద్దరు సోదరులు నరేశ్, అమర్ సిన్హ్ గుర్జార్‌లను శుక్రవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్సయాయి, హరిసిన్హ్‌లు సూరత్‌లోని మార్బల్ యూనిట్‌లో లేబర్ కాంట్రాక్టర్లు. ‌‌నరేశ్, అమర్ ‌సిన్హ్‌లు వారి దగ్గర పనిచేస్తున్నారు. 


అప్పటినుంచి హర్సయాయి పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఏప్రిల్ 5న బాలిక గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కారులో బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లి తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రికెట్‌ మైదానంలో పడేశారు. ఏప్రిల్ 10న పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న బాలిక తల్లి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌ మార్టం నివేదికలో విస్తూ పోయే విషయాలు వెలుగు చూశాయి. ఒంటిపై 87 గాయాలు.. శరీరంలో చెక్క ముక్కలు బయటపడటం… ఈ కిరాతకం గురించి తెలిసిన ప్రజలు నిరసనలకు దిగారు. మరోవైపు చిన్నారి జాడ తెలుసుకోవటమే పోలీసులకు పెను సవాల్‌గా మారింది. దీంతో కేసు క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యింది. ఇంకా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు వివరించారు.