mictv telugu

రీట్వీట్ చేసిందుకు రూ. 6.5 కోట్ల ఆఫర్..

January 7, 2019

సోషల్ మీడియాలో ఓ అద్భుతం జరిగింది. ఆక్టివ్‌గా వుండే యూజర్లకు కాసుల వర్షం కురిసింది. ఇదేదో మాయో మంత్రమో జరగలేదు. అనుకోకుండా కొందరు యూజర్లు ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. దీంతో చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ట్వీట్‌ను రీట్వీట్ చేసినందుకు ఏకంగా 6.5 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారు. విచిత్రంగా వుంది కదూ. ఇంతకీ ఆ ట్వీట్ ఎందుకు అంతగా రీట్వీట్లకు నోచుకుందో, దానివల్ల ఆ చైనా వ్యక్తికి వచ్చిన లాభాలేంటో తెలుసుకుందాం.  

Telugu news Rs 6.5 crores for retweeting.. Within two days, 48 lakh retweets were made

 చైనాకు చెందిన ప్రముఖ దుస్తుల వెబ్‌సైట్ జోజోటౌన్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతేక సేల్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుపుతూ వెబ్‌సైట్ సంస్థాపకుడు యుసాకు మయేజవా తన ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు. ఆయనలా ట్వీట్ చేయగానే వరుసగా రీట్వీట్లు కాసాగింది. రెండు రోజుల్లోనే ఏకంగా 48 లక్షల రీట్వీట్‌లు అయ్యాయి. దీంతో ఆ ట్వీట్‌కు సెలబ్రిటీ హోదా వచ్చింది. ఫలితంగా జోజోటౌన్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. విస్తృతంగా లాభాలు వచ్చాయి.

ఎంచక్కా లాభాలు వచ్చాయని యుసాకు చంకలు గుద్దుకోలేదు. దీనికి కారణం కొందరు చేసిన రీట్వీట్‌లే అని గ్రహించాడు. మంచి మనసుతో ఓ వంద మందికి తనకొచ్చిన లాభాల్లోంచి 6.5 కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో యుసాకా సహృదయతను మెచ్చుకుంటూ చాలా మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇకనుంచి ఇలాంటి పోస్టులకు లైకులు, కామెంట్లతో సరిపెట్టకుండా షేర్లు చేయాలని, అప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని చమత్కరిస్తున్నారు.Telugu news Rs 6.5 crores for retweeting.. Within two days, 48 lakh retweets were made