వర్మ జీఎస్టీకి  11 కోట్ల ఆదాయం.. ఖర్చు 70 లక్షలే - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ జీఎస్టీకి  11 కోట్ల ఆదాయం.. ఖర్చు 70 లక్షలే

January 31, 2018

రాంగోపాల్ వర్మ చాలా పకడ్బందీ గేమ్ ఆడతాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అయ్యాయి. వివాదాస్పద ‘ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ’ సినిమా విషయంలో అది నిజమే అని తేటతెల్లమైంది. 19 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు రూ. 70 లక్షలు ఖర్చు అయింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతో తెలుసా.. రూ. 11 కోట్లు. ఇంకా ముందు ముందు రాబడి పెరిగే అవకాశముంది. ఆ సినిమా పెట్టిన వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే రూ. 150 లు కట్ అయ్యేలా ఏర్పాటు చేశారు.

అలా ఈ వీడియోని కోటి మంది చూస్తే కనీసం రూ. 150 కోట్ల లాభం. జీఎస్టీ చూడాలంటే అమెరికా వాళ్లయితే రూ. 180 ఇండియా ఐతే, రూ. 150, శ్రీలంక,  పాకిస్తాన్ వాళ్లయితే రూ. 200లు అని రేటు కట్టి ఇప్పటికైతే రూ. 11 కోట్లు రాబట్టుకున్నాడు. సదరు వెబ్‌సైట్ క్రాష్ అవకుండా వుండుంటే ఇప్పటికి వర్మ అనుకున్న లాభాలు వచ్చుండేవని సమాచారం. ఇంతకీ ఆ సినిమాకు  పెట్టిన 70 లక్షల బడ్జెట్లో ఎక్కువ భాగం మియా మాల్కోవాకే ఇచ్చారట. ఇంకొంచెం సంగీత దర్శకుడు ఎమ్. ఎమ్. కీరవాణికి ఇచ్చారట.