ఆర్టీసీ బస్సును అరెస్ట్ చేశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ బస్సును అరెస్ట్ చేశారు..!

February 14, 2018

మంత్రి గారి నుంచి మార్కులు కొట్టెయ్యాలనే ఉబలాటంకొద్ది పోలీసులు ఆర్టీసీ బస్సును అరెస్ట్ చేశారు. మనుషుల్ని అరెస్ట్ చేస్తారు కానీ బస్సును అరెస్ట్ చేయటమేంటని అనుకోవద్దు. నిజంగానే పోలీసులు బస్సును అరెస్ట్ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరంలో జరిగింది.

హోం మంత్రి చిన రాజప్ప కాన్వాయ్‌ కాకినాడ – అమలాపురం మార్గంలో వెళ్తోంది. మంత్రిగారు ఆ దారి గుండా వస్తున్నారని అప్పటికే చాలా వాహనాలను ఆపేశారు పోలీసులు. కానీ అదే మార్గంలో నాన్‌స్టాప్‌ సర్వీస్‌ ఆర్టీసీ బస్‌ వెళ్తోంది. మంత్రిగారైతే ఏంటి, మంత్రిగారి వియ్యంకుడైతే నాకు ఏంటని ఆ బస్సు తన నాన్‌స్టాప్ రూలును ఫాలో అవుతూ, ప్రయాణీకులను గమ్యానికి చేర్చటానికి వెళుతోంది. సరిగ్గా ఇక్కడే పోలీసులకు మంత్రిగారి దగ్గర మార్కులు అత్యుత్సాహం ఎక్కువైంది.వెంటనే ఆ బస్సును  ముమ్మడివరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ప్రయాణికులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ప్రజా నాయకులు వాళ్ళు,  వాళ్ళు ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగించడం అస్సులు బాగాలేదు. ప్రజలు ఓటేస్తేనే ఆయన మంత్రి అయ్యారు. ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టడం ప్రజా ప్రతినిధులు మానుకోవాలి. పోలీసులు కూడా ప్రజల పక్షం వుండాలి’ అని అంటున్నారు వాళ్ళు.