ఆదర్శ డాక్టరమ్మా..నీ పట్టుదలకి  సలాం - MicTv.in - Telugu News
mictv telugu

ఆదర్శ డాక్టరమ్మా..నీ పట్టుదలకి  సలాం

November 22, 2017

రుక్మాభాయ్  ఈమె గురించి ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. కానీ ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో  మెడిసిన్ చదివిన తొలి భారతీయ మహిళ ఈమె.  11 సంవత్సరాల వయసులో వివాహం చేసుకొని ఎన్నో కష్టాలను అనుభవించి, తన చదువుకు వివాహం అడ్డుకాకూడదనుకొని, ఎంతో శ్రమించి, వివాహ బంధం నుండి విముక్తి పొంది, స్వయంకృషితో  మెడిసిన్ చేసింది.

ఆతర్వాత బాల్య వివాహాలపై పోరాటం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఈరోజు ఆమె 153 వ పుట్టినరోజు, ఆమె ఓర్పుతో నేర్పుతో జీవితంలో ఎన్నో విజయాలను సాధించింది. ఎందరో మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా  గూగుల్ ఇండియా కూడా తన హోమ్ పేజీని కూడా ఆమెకు అంకితం చేసింది. ఎందరో భారతీయ వనితలకు ఆదర్శంగా నిలిచిన రుక్మాభాయ్ కి హాట్యాఫ్.