మనిషి మాంసం కోసం చంపారు… - MicTv.in - Telugu News
mictv telugu

మనిషి మాంసం కోసం చంపారు…

September 9, 2017

మనిషి మాంసం కోసం  ఓ అమ్మాయిని చంపిన సంఘటన రష్యాలో జరిగింది. రష్యాలోని ఓ పట్టణ సమీపంలోని నది ఒడ్డున అమ్మాయి శవం దొరికింది. దాంతో ఆ పట్టణ వాసులు వణుకుతున్నారు. ఒంటరిగా ఆడవాళ్లు బయటికిరావడానికి బెదిరిపోతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు  అమ్మాయి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె శరీరంలోని భాగాలను  కత్తితో కోసి మాంసాన్ని  సేకరించినట్టు ఉంది. సంఘటన స్థలంలో సర్జరీకి వినియోగించే గ్లౌజులు దొరకడంతో … ఓ నేర్పరి అయిన డాక్టరే ఈ ఆఘూత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మనిషి మాంసం కోసం అమ్మాయిని చంపినట్టు రష్యా న్యూస్ చానెళ్లలో ప్రసారం కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మనిషి రక్తమాంసాలకు అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని ప్రజలు పోలీసులను కొరారు. రష్యా ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.