తమిళంలో ‘ఆర్‌ఎక్స్ 100’.. ఆదినే హీరో !

ఒక్క సినిమాతో పెద్ద హిట్ కొట్టాలంటే కంటెంట్ ఉండాలి.. అలా ఒక్క సినిమాతోనే టాప్ డెరెక్టర్ల లిస్ట్‌లో  చేరిపోయారు ఇద్దరు డెరెక్టర్లు. అర్జున్‌రెడ్డి సినిమాతో సందీప్‌రెడ్డి వంగా, ఆర్‌ఎక్స్ 100‌తో అజయ్ భూపతి తెలుగులో భారీ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పటికే అర్జున్‌రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతుండగా.. రిసెంట్‌గా రిలీజ్ అయిన ఆర్ఎక్స్ 100 కూడా తమిళంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం..

Rx100 in tamil.. Hero aadi pinisetty.

తక్కువ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రం తెలుగులో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోను తీయనున్నారట. ఇందులో హీరోగా ఆది పినిశెట్టి నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందా..? లేక వేరే ఎవరినైనా తీసుకుంటారా ?? తెలియలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..