శ్రీదేవిని భారతీయ మీడియానే చంపేసింది: దుబాయ్ మీడియా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవిని భారతీయ మీడియానే చంపేసింది: దుబాయ్ మీడియా

March 1, 2018

దుబాయ్ దిగ్గజ మీడియా ఖలీజ్ టైమ్స్ భారతీయ మీడియాపై దుమ్మెత్తి పోసింది. ఊహాగానాలతో వార్తలు రాస్తూ శ్రీదేవిని భారతీయ మీడియానే చంపేసింది అని ఓ కథనం రాసింది. శ్రీదేవి మృతిపై అత్యూత్సాహంతో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ, చివరకు బాత్ టబ్ లో కూడా దిగి ఓవర్ యాక్షన్ చేశారని భారతీయ మీడియాపై  విమర్శలు చేసింది దుబాయ్ మీడియా.

అంతేకాదు భారతదేశంలో చాలామంది ఇళ్లలో బాత్ టబ్ లు ఉండవు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చాలా మంది భారతీయులకు తెలీదు అని ఎద్దేవ చేసింది.  శ్రీదేవి మృతిపై మా సంస్థ ప్రతినిధులు వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు అంతేకానీ తప్పుడు వార్తలను ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయిందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసినా కూడా ‘ఎవరో చంపేశారని, పలు అనుమానాలు ఉన్నాయి’ అని భారతీయ మీడియా పబ్లిక్‌ను కన్‌ఫ్యూజ్ చేశారని దుబాయ్ మీడియా తను రాసిన కథనంలో పేర్కొంది.