ముంబైకి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం - MicTv.in - Telugu News
mictv telugu

ముంబైకి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం

February 27, 2018

దుబాయ్ నుంచి అంబానీకి చెందిన  ఫ్లైట్‌లో బయలుదేరిన శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరింది. ఈ సందర్భంగా  ముందే ముంబై పోలీసులు ఏయిర్ పోర్ట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్ది క్రితమే అనిల్ కపూర్, అనిల్ అంబానీ, టీనా అంబానీ కూడా ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. శ్రీదేవి భౌతికకాయం ఏయిర్ పోర్ట్ కు వచ్చిందని తెలియగానే అభిమానులు కూడా భారీగా ఏయిర్ పోర్ట్‌కు తరలి వస్తున్నారు.ప్రత్యేక ఆంబులెన్స్ కూడా ఏయిర్ పోర్ట్ వద్ద పోలీసులు ముందే సిద్దంగా ఉంచారు. అయితే శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆసుపత్రికి తరలిస్తారా? లేక ఆమె నివాసానికి తరలిస్తారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.