శబరిమల ఉద్రిక్తం.. మసీదులోకి వెళ్లేందుకు మహిళల యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల ఉద్రిక్తం.. మసీదులోకి వెళ్లేందుకు మహిళల యత్నం

January 8, 2019

కేరళలో ముగ్గురు మహిళలు మరో వివాదానికి తెరలేపారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శబరిమల సమీపంలో వున్న వావర్ మసీదులోకి వెళ్లేందుకు ముగ్గురు మహిళలు ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఈ ముగ్గురిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు మహిళలు హిందూ మక్కల్ కట్చి సంస్థకు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురు మహిళలపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Telugu news Sabarimala row: Hindu Makkal Katchi team en route Erumeli Vavar mosque remandedగతవారం మీడియా సమావేశంలో ఈ ముగ్గురు మసీదులోకి వెళ్లి తీరుతామని ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించినప్పుడు, మసీదులోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారు అన్నమాట ప్రకారం మసీదులోకి వెళ్లే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు.Telunews Sabarimala row: Hindu Makkal Katchi team en route Erumeli Vavar mosque remanded