50% తగ్గిన శబరిమల భక్తులు.. సుప్రీం తీర్పు ఎఫెక్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

50% తగ్గిన శబరిమల భక్తులు.. సుప్రీం తీర్పు ఎఫెక్ట్!

November 19, 2018

మహామండల మకరవిళక్కు పూజల కోసం తెరచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద కేరళ ప్రభుత్వం గట్టి భద్రత అమలు చేస్తోంది. నిరసనలు జరక్కుండా అడ్డుకుంటోంది. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు కొండ ఎక్కకుండా భక్తులు అడ్డుకుంటుండడంతో శబరిగిరుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Telugu news Sabarimala sees 50% dip in devotees Hindu groups say CPM govt trying to 'take over' Ayyappa shrine.

మకరవిళక్కు పూజల కోసం గుడిని ఈ నెల 16న తెరిచారు. సుప్రీం కోర్టు తీర్పు, తదనంతర పరిణామాల వల్ల భక్తుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. గతేడాది ఇదే సీజన్లో తొలి మూడు రోజుల్లో 2.10 లక్షల మంది స్వామిని దర్శించుకోగా, ఈ సీజన్లో కేవలం 90 వేలమందే వచ్చారని ట్రావెంకోర్ దేవస్వం బోర్డు తెలిపింది. ఇదివరకు భక్తులు 18 మెట్లు ఎక్కాలంటే గంటలపాటు వేచి చూడాల్సి వచ్చేదని, ఈ సారి భక్తులు తగ్గడంతో క్యూలు ఖాళీగా కనిపిస్తున్నాయని, త్వరగా దర్శనం కలుగుతోందని సిబ్బంది చెబుతున్నారు. తగ్గిన లెక్కలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టుల ప్రభుత్వం శబరిమల ప్రాశస్త్యాన్ని తగ్గించి, నాస్తికత్వాన్ని ప్రచారం చేయడానికి యత్నిస్తోందని, అందులో భాగంగానే భక్తుల సంఖ్య తగ్గిందని ఆరోపిస్తున్నారు. అన్ని వయసుల మహిళలు స్వామిని దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదం నెలకొనడం తెలిసిందే.

Telugu news Sabarimala sees 50% dip in devotees Hindu groups say CPM govt trying to ‘take over’ Ayyappa shrine