10 రోజులు తెరుచుకోనున్న శబరిమల ఆలయం - MicTv.in - Telugu News
mictv telugu

10 రోజులు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

April 10, 2018

శబరిమల  అయ్యప్ప పుణ్యక్షేత్రం విషు పండగ సందర్భంగా తెరుచుకోనుంది. మంగళవారం నుంచి పదిరోజుల వరకు ఆలయం తెరిచే వుంటుంది. ఈరోజు సాయంత్రం ప్రధాన అర్చకుడు ఏవీ ఉన్నికృష్ణన్ నంబూద్రి సమక్షంలో ఆలయాన్ని తెరుస్తారు.

అష్టద్రవ్య గణపతి హోమం తర్వాత భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు. రానున్న పది రోజులు ఆలయంలో  కళాభాభిషేకం, సహస్ర కళషాభిషేకం, పుష్పాభిషేకం, ఉదయస్తమన పూజలు, పడిపూజ, అష్టాభిషేకాలు నిర్వహించనున్నారు. అదే విధంగా 15వ తేదీన ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయ్యప్ప దర్శనం ఉంటుందని.. అలాగే ఆలయంలో విషుక్కాని దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు.