బ్రిడ్జ్‌కోసం సచిన్ 2 కోట్ల నిధులు - MicTv.in - Telugu News
mictv telugu

బ్రిడ్జ్‌కోసం సచిన్ 2 కోట్ల నిధులు

October 23, 2017

పశ్చిమ రైల్వేకు చెందిన ముంబయి ఎల్ఫిన్‌ స్టోన్‌ రోడ్‌ స్టేషన్‌లోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్రిడ్జ్ పునర్నిర్మాణంకోసం, సచిన్ తన ఎంపీ నిధులనుంచి 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశాడు.  

ముంబై సబర్‌బన్ జిల్లా కలెక్టర్, బ్రిడ్జ్‌కు సంబంధించిన పనులు వెంటనే చేపట్టేలా చూడాలని  రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు సచిన్ ఓలేఖ ద్వారా తెలిపాడు. ముంబై సబర్‌బన్ సర్వీసుల కోసం రెండు వేర్వేరు ఇండిపెండెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని కూడా సచిన్ ఈ లేఖలో రైల్వే శాఖను కోరారు.