టీ20 బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్.... - MicTv.in - Telugu News
mictv telugu

టీ20 బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్….

February 17, 2018

క్రికెట్  దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీయర్‌లో ఎన్నో సంస్థలకు, కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. తాజాగా సచిన్ టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సహకారంతో ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  మార్చి 11 నుంచి 21 వరకు ఈ లీగ్ నిర్వహించనుంది. ఆరు జట్లతో నిర్వహించే టోర్నీలో భాగస్వామ్యయ్యే ఫ్రాంఛైజీల కోసం బిడ్లను కూడా ఆహ్వానించింది.

సచిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ క్రేజ్‌‌ను లీగ్ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని నిర్వాహకులు భావించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఎంసీఏతో అనుబంధం ఎప్పటికీ తనకు సంతోషమేనని చెప్పారు. టీ20 ముంబై లీగ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మాత్రమే కాదని యువ క్రికెటర్లు తమ సత్తాను చాటుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమని సచిన్ తెలిపారు.