సచిన్ కూతురి పేరుతో బూతు ట్వీట్లు.. టెకీ అరెస్ట్   - MicTv.in - Telugu News
mictv telugu

సచిన్ కూతురి పేరుతో బూతు ట్వీట్లు.. టెకీ అరెస్ట్  

February 8, 2018

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పేరు మీద ట్విటర్ ఖాతాను క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుణ్ని ముంబైలోని అంధేరికి చెందిన నితిన్ షిశోడే  అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా గుర్తించారు. ఇతడు  సెలబ్రెటిలను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేయడం,వారి కూతుళ్ల పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లను క్రియేట్ చేసి వికృత కార్యకలాపాలకు పాల్పడటం చేస్తున్నాడు.

సారా పేరిట ట్విటర్ అకౌంట్ సృష్టించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అభ్యంతకరమైన పోస్టులు చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రముఖుల పిల్లల పేరిట సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసి కొందరు ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడుతున్నారని,  అలాంటి వారు జైలుపాలు కావాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.గతంలో సచిన్ తన కూతురు సారా,  కుమారుడు అర్జున్‌ల పేరిట ఉన్న నకిలీ ట్విటర్ ఖాతాలను తొలంగించాలని ట్విటర్ సంస్థను కోరారు. తన పిల్లలకు అస్సలు ట్విటర్ అకౌంట్లు లేవని, వీలైనంత త్వరగా వారి పేరుమీదగా ఉన్న ట్విటర్లును తొలంగించాలని వరుసగా ట్వీట్లు చేశారు. ఈ నకిలీ  ఖాతాల నుంచి తప్పుడు సమాచారం పోస్టు అయితే పరిస్థితి మరోలా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అర్జున్ ,సారా పేర్లతో ఉన్న ట్విటర్లను  నమ్మకూడదని చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశాడు.