mictv telugu

శాడిస్ట్ భర్త… మూడో పెళ్లి చేసుకుంటానని భార్యలకు నరకం

January 14, 2019

నిత్య పెళ్ళిళ్ళు చేసుకోవడం కొందరికి ఫ్యాషనైపోయింది. చేసుకున్న పెళ్లాం, పిల్లల పోషణ, చదువులు, ఇల్లు, స్థిరత్వం బాగా చూసుకుంటున్నామా లేదా అన్న కనీస ఆలోచన కూడా లేకుండా పెళ్లిళ్లు చేసుకుని మహిళలు, పిల్లల ఉసురు తీసుకుంటున్నారు కొందరు నీచులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న భార్యను, పిల్లల పోషణ, చదువులు, బాధ్యత ఎంతో బరువుగా సాగుతోంది. కానీ ఒకతను అవన్నీ నైజాన్తా అన్నట్టే చేశాడు. పెళ్లిళ్ళు చేసుకోవడం సరదాగా మార్చుకున్నాడు.

Telugu news Sadist's husband Wifes are hell to have a third marriage .

అతనికి ఇద్దరు భార్యలున్నారు. మొన్నే ఓ కొడుకు కూడా పుట్టాడు. అయినా మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు. భార్యల అనుమతి కోసం వాళ్లను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.

ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బోరబండలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖాన్‌కు   రుక్సార్ బేగం, నిస్సార్ బేగం అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. 15 రోజుల క్రితం నిస్సార్ బేగంకు ఓ బాబు కూడా పుట్టాడు. ఉన్న ఇద్దరు భార్యలు పిల్లల్లో అతనికి సంతృప్తి కలగనట్టు మూడో పెళ్లి చేసుకుంటానని రోజూ ఇంట్లో పోరు పెట్టడం ప్రారంభించాడు.

మూడో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వారిద్దరిని నిత్యం వేధింపులకు గురి చేయసాగాడు. బాలింత అని కూడా చూడకుండా నిస్సార్‌పై చేయిచేసుకున్నాడు. అతను పెట్టే  బాధలను భరించలేని ఇద్దరు భార్యలు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telugu news Sadist's husband ... Wifes are hell to have a third marriage