ఎవడ్రా ఈ వార్త రాసింది... పాపం సాయిపల్లవి - MicTv.in - Telugu News
mictv telugu

ఎవడ్రా ఈ వార్త రాసింది… పాపం సాయిపల్లవి

November 21, 2017

వ్యూస్ రానీకి, ట్రెండింగ్‌లోకి వోనికి వార్తల్లో పైత్యం రోజు రోజుకు మితి మీరుతోంది. ఎవ్వరికిష్టమచ్చినట్టు వాళ్లు హెడ్డింగులు పెట్టి య్యూట్యూబ్‌లోకి ఎక్కిస్తున్రు. తాజాగా సాయిపల్లవి తల్లి అయ్యిందనే వార్త య్యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుంది.

అసలు ఆ హెడ్డింగ్ చూస్తే రాసినోడికి సిగ్గుందా అనిపిస్తుంది. ‘అతని వల్ల తల్లి కాబోతున్న సాయిపల్లవి అతను ఎవరో కాదు’  ఇది మీద పెట్టిన హెడ్డింగ్, వీడియో ఓపెన్ చేస్తే, అసలు మ్యాటర్ వేరే ఉంటుంది. నాగశౌర్యతో సాయిపల్లవి తెలుగు, తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఆసినిమాలో సాయిపల్లవి ఓబిడ్డకు తల్లిగా,గర్భవతిగా నటిస్తోంది.

దానికి సాయిపల్లవి తల్లి కాబోతుందని హెడ్డింగ్ పెట్టారు. ఓ పెళ్లికాని ఆడపిల్లను గర్భవతి కాబోతుందని వార్త రాస్తే, వాళ్ల ఇంట్లో వాళ్లు ఆ హెడ్డింగ్ జూశి ఏమన్కుంటరనే సోయి లేదు, అవి చదివి వాళ్లు ఎన్ని ఇబ్బందులకు గురి అవుతారనే ఆలోచనలేదు. ఎంతసేపు ట్రెండింగ్‌లోకి వెళ్లాలనే ఒక్కటే ఆలోచన. ఇలాంటి వార్తల వల్ల తెలుగు మీడియా అంటేనే  చాలామందికి అసహ్యం కలిగుతుందనేది పచ్చినిజం.