కేటీఆర్‌ గారూ.. మా పెళ్లికి తప్పకరండి.. సైనాకశ్యప్

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌కు వివాహ ఆహ్వానం లభించింది. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఈనెల 16న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కేటీఆర్‌కు కలిసి తమ వివాహానికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని సైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వీరి ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్ తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారట.

rrr

‘కేటీఆర్ గారికి థ్యాంక్స్. మిమ్మల్ని కలవడం, క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం నాకు చాలా ఆనందం కలిగించింది. నా వివాహ వేడుకలో మళ్లీ కలుద్దాం’ అంటూ సైనా ఓ పోస్ట్ చేసింది. కాగా సైనా, కశ్యప్‌లు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.