కళ్లుతిరిగేలా పెరగనున్న  క్రికెటర్ల జీతాలు - MicTv.in - Telugu News
mictv telugu

కళ్లుతిరిగేలా పెరగనున్న  క్రికెటర్ల జీతాలు

December 4, 2017

మనదేశం తరపున ఆడే క్రికెటర్ల జీతాలు తొందరలోనే భారీగా పెరగనున్నాయి. దాదాపు  ఇప్పుడు వారికిస్తున్న వేతనానికి ఆరు రెట్లు పెంచెందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది  క్రికెటర్ల జీతాలు పెంచాలని ఇప్పటికే ధోని, కోహ్లీ, రవిశాస్త్రి  సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌తో చర్చలు జరిపారు.  

పెరగనున్న జీతాల ప్రకారం గ్రేడ్-ఏ కాంట్రాక్టులుగా ఉన్న కోహ్లీ, పూజారా, అశ్విన్ మరియు ఇతర ఆటగాళ్లకు ప్రస్తుతం ఏటా 2 కోట్లుగా వస్తున్న వేతనాన్ని రూ.12 కోట్లు చేయబోతున్నట్టు సమాచారం. ఇక గ్రేడ్ బీ క్రికెటర్లు ఏడాదికి కోటీ రూపాయలు వేతనంగా అందుకుంటున్నారు. వీరి జీతాలు కూడా రూ.8 కోట్లు వరకు పెంచనున్నారు. గ్రేడ్ సి, మరియు రంజీ ఆటగాళ్లు  కూడా భారీగానే పెరగున్నాయి. గతంతో పోలిస్తే  క్రికెటర్ల  కెరీయర్ కాలం తక్కువగా ఉండడంతో  నిరుదోగ్యం, సరైన ఆదాయం లేక వారు ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే  ఆటగాళ్ల వేతనాలు భారీగా పెంచనున్నారట. అయినా స్టార్ డమ్ వచ్చిన క్రికెటర్లకు  జీతంలో పనేలేదు. ఒక్క యాడ్‌లో నటించినా కోట్లు కుమ్మరించడానికి కంపెనీలు క్యూ కడతాయి. కానీ ఇప్పుడు పెంచే భారీ వేతనాలతో స్టార్‌డమ్ లేని క్రికెటర్లకు మాత్రం భారీ ప్రయోజనం కలుగుతుంది.