సఖబ్‌పై సల్మన్ కన్ను.. 2 కోట్లు ఇస్తానన్నా దక్కలేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

సఖబ్‌పై సల్మన్ కన్ను.. 2 కోట్లు ఇస్తానన్నా దక్కలేదు..

February 6, 2018

ఓ గుర్రాన్ని రెండు కోట్లు కొనడానికి  బాలీవుడ్ హీరో సల్మాన్  ఖాన్ ముందుకు వచ్చాడు. అయితే ఆ మూగజీవి యాజమాని.. ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. సల్మాన్ ఖాన్ గుర్రం కొనడం ఏమిటని అనుకుంటున్నారా? ఆయన ఆసక్తి  చూపించడానికి అది  మాములు గుర్రం కాదు. ప్రపంచంలో అలాటి గుర్రాలు మూడే ఉన్నాయి. ఒకటి  అమెరికాలో ఉండగా, మరొకటి కెనడాలో ఉంది. మూడో గుర్రం గుజరాత్‌లో నివసిస్తున్న  సిరాజ్ పఠాన్ దగ్గర ఉంది. దాని పేరు సఖబ్.

ఈ అరుదైన గుర్రాని తమ సొంతం చేసుకుంనేందుకు చాలామంది  ప్రయత్నించారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ గుర్రాని కొనుగోలు చేసేందుకు  ప్రయత్నించారు . ఓ మధ్యవర్తి ద్వారారూ. 2 కోట్లను యాజమానికి ఆఫరు చేశాడు. కాని సఖబ్ యాజమాని సున్నితంగా తిరస్కరించాడు.

సఖబ్ గంటకు 43 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతుంది.  తనపై స్వారీచేసే వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఒకే స్థిరవేగంతో పరుగెత్తడం సఖబ్ ప్రత్యేకత. సఖబ్ తల్లి పాకిస్థాన్ సింధీ రకానికి చెందిన గుర్రం. తండ్రి రాజస్థాన్‌‌కు చెందిన సుతార్వలి రకం. సఖబ్‌ను ఐదు ఏళ్లు వయస్సులో సరాజ్ పఠాన్ 14.5 లక్షలకు పలోతరా మార్కెట్ లో కోనుగోలు చేశాడు. సఖబ్ అంటే మహ్మద్ ప్రవక్త  గుర్రం అని అర్థమట.