సల్మాన్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు... - MicTv.in - Telugu News
mictv telugu

సల్మాన్‌ఖాన్‌ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ కోర్టు…

April 5, 2018

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ ,సోనాలీ బింద్రే. టబు,నీలంను కోర్టు నిర్థోషులుగా పేర్కొంది.1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’  సినిమా చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌ అడవుల్లో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది.మూగజీవాలను అతి క్రూరంగా వేటాడి చంపాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో న్యాయమూర్తికి వాదనలు వినిపించాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌‌ఖాన్‌కు గరిష్టంగా ఆరేళ్ల నుంచి కనిష్టంగా మూడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. జోధ్‌పూర్‌ కోర్టు తీర్పును సల్మాన్‌‌ఖాన్‌  సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.