విదేశాలకు వెళ్లాలి..  కోర్టు అనుమతి కోరిన సల్మాన్ - MicTv.in - Telugu News
mictv telugu

విదేశాలకు వెళ్లాలి..  కోర్టు అనుమతి కోరిన సల్మాన్

April 17, 2018

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు  కృష్ణ జింకల కేసులో జోధ్‌పూర్ కోర్టు దోషిగా  ప్రకటించింది. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.  అయితే సల్మాన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ జోధ్‌పూర్ కోర్టులో ఈ రోజు పిటీషన్ దాఖలు చేశాడు.సినిమా చిత్రీకరణ నిమిత్తం నాలుగు దేశాల్లో పర్యాటించడానికి అనుమతిని మంజూరు చేయాలని కోరాడు.విదేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు కోర్టు అనుమతి పొందాల్సి ఉంటుందని బెయిల్ మంజూరు సమయంలో కోర్టు స్పష్టం చేసింది. దీంతో విదేశీ పర్యటన అనుమతి కోసం సల్మాన్ ఖాన్ కోర్టును ఆశ్రయించారు.