తెల్లబట్టలు వేసుకుని జైలుశిక్ష తప్పించుకున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెల్లబట్టలు వేసుకుని జైలుశిక్ష తప్పించుకున్నారు..

April 7, 2018

20 ఏళ్ళ తర్వాత జింకల వేట కేసులో  జోధ్‌పూర్ కోర్ట్ సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ళ జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సహ నిందితులుగా వున్న సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్‌తో పాటు ఈ నలుగురూ వేటకు వెళ్ళారు. వీరు ప్రోత్సహించడం వల్లే సల్మాన్ వేటాడాడు అనే వాదనలు  వినిపించాయి. కానీ వారి మీద సరైన ఆధారాలు లేకపోవటంతో వాళ్ళను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.ఎందుకంటే…

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా వున్న పూనమ్ చంద్ బిష్ణోయ్ విచిత్రమైన సాక్ష్యం చెప్పాడు. సైఫ్, టబు తదితర ముఠా తెల్ల దుస్తులలో వుండటం వల్ల వాళ్ళలో ఎవరు ఎవరో తాను పోల్చుకోలేకపోయానని కోర్టు ముందు చెప్పాడు. సల్మాన్ వేరే దస్తుల్లో ఉండడంతో అతన్ని బాగా గుర్తుపట్టానని తెలిపాడు. పూనమ్  సాక్ష్యం ఆధారంగా ఆ నలుగురికి శిక్ష పడలేదు.

ఇదిలా వుండగా ఆ సమయంలో జీపులో వెనక సీటులో సల్మాన్‌తో పాటు ఉన్న టబు కృష్ణజింకను కాల్చమని రెచ్చగొట్టారని  గురువారం మరో ప్రత్యక్షసాక్షి కోర్టులో చెప్పాడట. సైఫ్, నీలమ్‌లు జీపు ముందు సీటులో కూర్చోవటం వల్ల వారు సల్మాన్‌కు ఎలాంటి సహాయం చేయలేదని రుజువైంది. దీంతో వారు ఈ కేసు నుంచి ఉపశమనం పొందారు. అప్పటికీ ఎవరూ పెద్ద స్టార్లు కారు. వారిని గుర్తు పట్టనప్పుడు సల్మాన్‌ను మాత్రమే బిష్ణోయ్ ఎలా గుర్తు పట్టగలడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.