సమంత హనీమూన్ ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

సమంత హనీమూన్ ఇలా..

October 27, 2017

సినీజంట సమంత – నాగచైతన్యలు లండన్‌లో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఫోటోలో సమంత వేసుకున్న షర్ట్ వెనకాల ‘ మిస్ అక్కినేని ’ అని కుట్లతో రాసి వుంది. ఇద్దరూ చిలకా గోరింకల్లా అక్కడి వీధుల్లో జామ్మంటూ తిరుగుతున్నారు. నిన్నా మొన్నటి వరకు ‘రాజుగారి గది 2’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న సమంత ఆ తర్వాత

సావిత్రి బయోపిక్ మహానటి సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నదట. తర్వాత చైతూతో కలసి ఎంచక్కా కొన్ని రోజులు సినిమాలకు సెలవు పెట్టి హనీమూన్ ట్రిప్పును ఎంజాయ్ చేస్తోంది. అక్కడ చైతూ కాఫీ తాగుతున్న వీడియోని సమంత తన స్నేహితులకి షేర్ చేయడంతో వీళ్ళ హనీమూన్ తాలూకు ఫోటోలు బయటకు వచ్చాయని చెబుతున్నారు.

లండన్ తర్వాత ఈ జంట సమంతకు ఇష్టమైన స్కాట్‌ల్యాండ్, బెల్‌ఫాస్ట్‌ను చుట్టేసి వస్తారనే ఊహాగానాలు వినబడుతున్నాయి.