మహానటి కోసం గొంతు సవరించనున్న సమంత - MicTv.in - Telugu News
mictv telugu

మహానటి కోసం గొంతు సవరించనున్న సమంత

April 5, 2018

నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’ . ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. సమంత విలేకరి మధురవాణి పాత్రలో నటిస్తోంది. సమంత తొలిసారి తన పాత్రకు డబ్బింగ్ తానే చెప్పనుంది. సమంత ఎనిమిదేళ్ల సినీ జీవితంలో ఆమెకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద  గొంతు ఆరువు ఇచ్చింది. కానీ ఇప్పుడు‘మహానటి కోసం సమంతనే గొంతును వినించబోతుంది. ఈ చిత్రానికి నాగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు,వి జయ్ దేవరకొండ, షాలిని పాండే, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.సమంత కథానాయికగా నటించిన ‘రంగస్థలం’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.100 కోట్లు రాబట్టింది. సమంత నటించిన ‘అభిమన్యుడు’ త్వరలో విడుదల కానుంది. మరోపక్క ఆమె ‘యూ టర్న్‌’, ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. భర్త నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనుంది.