రాజమహేంద్రవరంలో సమంత సందడి! - MicTv.in - Telugu News
mictv telugu

రాజమహేంద్రవరంలో సమంత సందడి!

February 20, 2018

కొన్ని రోజులుగా  హీరోయిన్ సమంత రాజమహేంద్రవరంలో సందడి చేస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న  రెండు సినిమాలు అక్కడే షూటింగ్ జరుపుకుంటున్నాయి.  మెగా తనయుడు రాంచరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ మరియు యూటర్న్ అనే  రెండు సినిమాల షూటింగులో బిజీ బిజీ గా ఉంది సమంత. అయితే షూటింగ్ విరామ సమయంలో  స్కూటీపై  షికార్లు చేస్తూ చుట్టుప్రక్కల గల్లీలు తిరుగుతోంది.  

ఆ ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్‌చల్ చేస్తున్నాయి. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన‘ యూ టర్న్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ అక్కినేని వారి కోడలికి రాజమహేంద్రవరం వాతావరం  చాలా బాగా నచ్చిందట. అందుకే షూటింగ్ లేనప్పుడు  కాస్త సమయం దొరికితే చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళుతోందట.