ఇంజిన్‌తో సమంత, చెర్రీ తంటాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇంజిన్‌తో సమంత, చెర్రీ తంటాలు

December 9, 2017

1980లనాటి నేపథ్యంలో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రంలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తున్నట్టున్నది. ఆయిల్ ఇంజిన్‌లో సమంత డీజిల్ పోస్తోంటే  పక్కనే వున్న చిట్టిబాబు రాంచరణ్ ‘దేవుడా నీళ్లు ఇప్పుడైనా రావాలి ’ అని మొక్కుకున్నట్టున్నది ఫోటోలో.

అప్పట్లో బోరు మోటార్లు లేనప్పుడు ఇలాంటి ఆయిల్ ఇంజిన్‌లతో రైతులు పడ్డ పాట్లు కనిపిస్తాయి. వాటి గురించి తెలిసినవారికి ఈ ఫోటోను చూస్తే తప్పకుండా ఆయిల్ ఇంజిన్ రోజులను గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంకొక ఫోటోలో చిట్టిబాబు మొక్కజొన్న పొత్తులను కోసి బుట్టలో వేసుకున్నాడు.

ఇంత వరకు సమంతను ఆమె అభిమానులు ఈ తరహా పాత్రలో చూడలేదు. అక్కినేని వారింటి కోడలయ్యాక సమంత ఖాతాలో రెండు పాత్రలు నిలిచిపోయేలా చేస్తోంది. ఒకటి ఈ సినిమాలోని పాత్ర అయితే, రెండవది సావిత్రి సినిమాలో జమున పాత్ర. రాంచరణ్ కూడా తన కెరియర్‌లో వినూత్నమైన పాత్రలో కనిపిస్తున్నాడనే చెప్పొచ్చు. 1985 ప్రాంతంలోని పరిస్థితులకు అనుగుణంగా వీరి పాత్రలను తీర్చి దిద్దినట్టున్నాడు దర్శకుడు సుకుమార్.