సినిమా నిర్మాణంపైనా సమంత కన్ను - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా నిర్మాణంపైనా సమంత కన్ను

December 2, 2017

కథానాయిక సమంత కేవలం తెలుగులోనే కాక తమిళంలోనూ కూడా తన సత్తా చాటుతోంది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా గ్యాప్ తీసుకోకుండు  సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే అక్కినేని కోడలిగా మారిన ఆమె తన మామ నాగార్జున సలహాలతో నిర్మాతగా కూడా  రాణించాలని బావిస్తోందని సమాచారం.సామ్ కన్నడ చిత్రం ‘ యు టర్న్ ’ ద్వారా నిర్మాతగా మారనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు పవన్  సమంత నిర్మాత కాదని చెప్పాడు. కానీ ఈ సారి మాత్రం మామయ్య నాగ్ సలహాలు తీసుకుని యూటర్న్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయాలనుకుంటుందని టాక్. దీని పై సమంత  అధికార ప్రకటన చేయలేదు.