మేనేజర్‌కు 3 కోట్లు ఇచ్చిన సమంత    - MicTv.in - Telugu News
mictv telugu

మేనేజర్‌కు 3 కోట్లు ఇచ్చిన సమంత   

November 21, 2017

అక్కినేని కోడలు సమంత మరోమారు తన మంచి మనసును చాటుకుంది. సమంత  దగ్గర ఎప్పట్నించో మహేందర్ అనే వ్యక్తి సౌత్‌లో మేనేజరుగా చేస్తున్నాడు. అయితే అతను నిర్మాతగా కొన్ని చిన్న చిన్న సినిమాలను నిర్మించాడు.  

తాజాగా  నారా రోహిత్ హీరోగా ‘ బాలకృష్ణుడు ’ అనే సినిమాను నారా రోహిత్‌తో కలిసి నిర్మించాడు. అయితే ఆ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా వున్నది. కాగా సినిమా తుది దశలో వుండగా డబ్బులు తక్కువ పడ్డాయట. ఏం చెయ్యాలో, ఎవర్ని అడగాలో తెలియక మహేందర్ సతమతమవుతున్నప్పుడు, సమంత అతని ఇబ్బందిని గమనించి రూ. 3 కోట్లు సహాయం చేసిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది.

సినిమా ట్రైలర్ చూసి తప్పకుండా సినిమా విజయాన్ని సాధిస్తుందనే ధీమాతో సహాయం   చేసిందట.  అయితే కొన్ని ఏరియాల్లో రైట్స్ పరంగా సమంత డీల్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. అంటే ఓ విధంగా బిజినెస్ అనుకోవచ్చు. 

నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా సమంతకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. మేనేజర్ మాత్రం సమంత చేసిన  సహాయానికి ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటున్నాడు.  గతంలో ‘ ప్రత్యూష ’ ఫౌండేషన్ ద్వారా  సమంత విజయవాడలో 15 మంది అనాధ పిల్లలు గుండె సంబంధిత రుగ్మతలతో బాధ పడుతుంటే. వారికి ఉచితంగా కార్డియాక్ సర్జరీలు చేయించి తన ధాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.