పొద్దున పెళ్లైంది. రాత్రికి వధువు డెలివరైంది - MicTv.in - Telugu News
mictv telugu

పొద్దున పెళ్లైంది. రాత్రికి వధువు డెలివరైంది

March 3, 2018

ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? చాలా సింపుల్  పెళ్లికి  రెండు సంవత్సరాలు గ్యాప్ వస్తే  ఏదైనా సాధ్యమే.  రాజస్థాన్ కు చెందిన పెళ్లికొడుకుకు   హర్యాణకు చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది.  అయితే కొన్ని కారణాల వల్ల  పెళ్లి వాయిదా పడింది. అలా ఏకంగా రెండేళ్లు వాయిదా పడింది.

నిశ్చితార్థం అయినా కూడా పెళ్లికి ఇంత గ్యాప్ రావడంతో  వారిద్దరూ  హద్దులు దాటారు. ఇంకే ముంది సరిగ్గా పెళ్లి సమయం వచ్చే సరికి  వధువు 9 నెలలు నిండిన నిండు గర్భిణి. పెళ్లి కూతురి తండ్రి  కన్యాదానం చేసి  వధువును వరుడి చేతిలో పెట్టాడు.  భార్యను తీసుకుని పెళ్లికొడుకు ఇంటికి బయలు దేరాడు. ఇంతలో భార్యకు  పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో అప్పటికప్పుడు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పండంటి బడ్డకు పెళ్లి రోజే పెళ్లి కూతురు జన్మనిచ్చింది. పెళ్లి కొడుకు ఆ బిడ్డను చూసుకుంటూ తెగ మురిసిపోయాడు. అలా ఒకేరోజు వీరిద్దరు  భార్య భర్తలు  అవడమే కాదు  ఓ బిడ్డకు అమ్మా నాన్నలు కూడా అయ్యారు.