నీది సిద్ధిపేటే.. నాది సిద్ధిపేటే - MicTv.in - Telugu News
mictv telugu

నీది సిద్ధిపేటే.. నాది సిద్ధిపేటే

November 23, 2017

ఈ ఫోటోలను చూస్తుంటే  కేసీఆర్ సంపూర్ణేష్ బాబుతో నీది సిద్దిపేటనే, నాది సిద్దిపేటనే  అని చమత్కరించినట్టు అనిపిస్తుంది కదా. గురువారం ప్రగతి భవన్‌లో యాక్టర్ సంపూ  కేసీఆర్‌ని కలిసారు. మరి ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సంపూ సడెన్ గా కేసీఆర్ ను ఎందుకు కలిసారనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే సంపూ  తెలుగులో నిర్వహించిన ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొన్నాడు. ‘హృదయ కాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంపూ తాజాగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. సంపూ కేసీఆర్ ను కలిసిన సందర్భంగా  తన తాజా సినిమా విషయాలను కూడా పంచుకున్నట్టు తెలుస్తోంది.