శాంసంగ్ ఫోన్లపై రూ 8 వేల క్యాష్‌బ్యాక్

ప్రముఖ ఈ-కామర్స్  సంస్థ అమెజాన్‌తో భాగస్వామ్యం పెట్టుకున్న శాంసంగ్ పలు స్మార్ట్‌ఫోన్లపై రూ. 8వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఆఫరుతో శాంసంగ్ కార్నివాల్ ప్రత్యేక సేల్‌ను సోమవారం ప్రారంభించింది.  8వ తేదీ వరకు ఈ ఆఫరు కొనసాగుతుంది. వినియోగదారులకు గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎ8 ప్లస్, ఆన్7 ప్రైమ్ (64 జీబీ), ఆన్7 ప్రైమ్ ఫోన్లపై వరుసగా రూ. 8 వేలు, రూ.4 వేలు, రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే యూజర్లు అమెజాన్ పే వాలెట్‌లో నగదు జమ చేసి కొంటేనే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. ఫోన్ డెలివరీ అయిన 10 రోజుల్లోగా క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. అలాగే ఈ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక పేటీఎం మాల్‌లోనూ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లపై కస్టమర్లకు రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. శాంసంగ్ నోట్8పై రూ.8వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ కూడా ఈ నెల 8 వరకు మాత్రమే లభించనుంది.