12 నిమిషాల్లోనే  ఫుల్ చార్జింగ్ అవుతదట - MicTv.in - Telugu News
mictv telugu

12 నిమిషాల్లోనే  ఫుల్ చార్జింగ్ అవుతదట

November 29, 2017

శాంసంగ్‌ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో బ్యాటరీలను తయారు చేసేందుకు సిద్దమయ్యింది. ‘గ్రఫెనీ బాల్‌’పేరుతో  ఐదు రెట్లు వేగంగా చార్జింగ్ అయ్యే బ్యాటరీలను తయారు చేయనుంది.

శాంసంగ్‌ తీసుకొచ్చే ఈ కొత్త బ్యాటరీని ఆలోట్రోఫ్‌ ఆఫ్‌ కార్బన్‌ తో మిళితమైన  గ్రఫెనీ మెటీరియల్‌తో తయారు చేయనున్నారు. వీటిని ఎక్కువగా ప్రాసెసర్లు, బ్యాటరీల్లో ఉపయోగిస్తారు. కేవలం మొబైల్‌ ఫోన్లకే కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారట.

శాంసంగ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎస్‌ఏఐటీ) పరిశోధకులు, శాంసంగ్‌ ఎస్‌డీఐ, సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ కెమికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి.