శాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్ 

ప్రముఖ ఎలక్రానిక్ దిగ్గజం శాంసంగ్  ఓ సరి కొత్త టాబ్లెట్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ‘గెలాక్సీ ట్యాబ్ ఏ’ పేరుతో దీన్ని విడుదల చేసింది. దీని ధర రూ. 17,990. ఈ రోజు నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కూడా ఆఫర్ చేయనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.

‘గెలాక్సీ ట్యాబ్ ఏ’ ఫీచర్లు…

8 అంగుళాల డిస్‌ప్లే 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ  వరకు విస్తరణ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బిక్క్బీ, హోమ్‌ ఉంటుంది.

SHARE