సర్జికల్ దాడుల వీరుడా.. జోహార్! - MicTv.in - Telugu News
mictv telugu

సర్జికల్ దాడుల వీరుడా.. జోహార్!

September 25, 2018

ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన యోధుడు సందీప్ సింగ్.. జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందాడు. 2016 నాటి భారత సర్జికల్ దాడుల్లో పాకిస్తాన్ ప్రరేపిత ఉగ్రవాదుల పీచమణచిన సందీప్ మరణం భారతీయులను కలచివేస్తోంది.

జమ్మూలోని కుప్వారా జిల్లా తంగ్‌ధర్ సెక్టార్‌లో ముష్కరులు చొరబాడుతున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు ఆదివారం ఎదురుదాడికి దిగాయి. వారికి, ఉగ్రవాదులకు  మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదుల్లో ఆరుగురుని మన జవాన్లు మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో లాన్స్ నాయక్ సందీప్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. ఫలితం దక్కలేదు.

Lance Naik Sandeep Singh, 2016 surgical strike hero, killed two terrorists at LoC before succumbing to his injuries

సందీప్ సింగ్ 2016 సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలపై భారతసైన్యం చేసిన ‘సర్జికల్ స్ట్రైక్స్’లో పాల్గొన్నాడు. ముష్కరులను హతమార్చడంలో కీలక  పాత్ర పోషించి అధికారుల మెప్పు పొందాడు. పంజాబ్ లోని గురుదాస్‌పూర్ జిల్లా కోట్లాఖుర్ద్ గ్రామానికి చెందిన సందీప్ సింగ్ 2007లో ఆర్మీలో చేరాడు. సందీప్ సింగ్ అంత్యక్రియల మిలిటరీ లాంఛనాలతో నిర్వహించనున్నారు.