కోటీశ్వరుడికి ఒక రోజు జైలు‘శిక్ష’ - MicTv.in - Telugu News
mictv telugu

కోటీశ్వరుడికి ఒక రోజు జైలు‘శిక్ష’

February 6, 2018

కొందరు తప్పు చేసి జైలుకు వెళ్తే.. మరికొందరు జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతారు. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ బంగారు గనల వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ అలాంటి వారిలో ఒకడు. అతడు  ఒక రోజు జైలు జీవితం గడిపాడు.

రూ. 2వేలు జైలు అధికారులకు చెల్లించి మరీ కోరికను నెరవేర్చుకున్నాడు. అంతేకాక తన ముగ్గురు స్నేహితుల ఆసీన్ అలీ, ప్రశాంత్, దుబాయ్  జర్నలిస్టు బినయ్‌తో కలిసి సంగారెడ్డి మ్యూజియం జైలులో  ఉన్నారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్లుగా ఒక్కసారైనా జైలు జీవితం  గడపాలని కోరిక ఉంది.. సంగారెడ్డి జైలు మ్యూజియం గురించి మీడియాలో తెలుసుకుని ఇక్కడికి వచ్చాను.

ఇప్పుడు నా కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది’అని తెలిపాడు. ఈ జైలు మ్యూజియానికి రోజురోజుకూ ప్రచారం పెరిగిపోతోందని, ఇప్పటివరకు 49 మంది అతిథులుగా  జైలు జీవితం గడిపి తమ అనుభూతిని పొందినట్లు  జైలు మ్యూజియం సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ తెలిపారు.