47వేల మంది అమ్మలు పరీక్షలు రాశారు... - MicTv.in - Telugu News
mictv telugu

 47వేల మంది అమ్మలు పరీక్షలు రాశారు…

March 26, 2018

అమ్మలు బడిబాట పట్టారు. అమ్మలు బడిబాట పట్టడం ఏమిటి అనుకుంటున్నారా?  జూహిరాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగత్మకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతో 47వేల మంది మహిళలకు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామపంచాయతీల్లోని పాఠశాల్లో ఆదివారం పరిక్షలు రాశారు.గ్రామల్లోని నిరాక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వారి పిల్లలే చదువు నేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది మార్చిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 50వేల మంది మహిళలు చదువు నేర్చుకున్నారుఐకేపీ, సాక్షర భారత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో  మహిళలకు వర్ణమాల, రెండు, మూడు అక్షరాల పదాలు, చిన్న లెక్కలు నేర్పించారు.

ఇటీవలే జహీరాబాద్‌కు చెందిన డెక్కన్ డెవలప్‌మెంట్ సొపైటీ(డీడీఎస్) ద్వారా థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా చేయించారు.

ఆదివారం ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించగా 47,084 మంది మహిళలు హాజరయ్యారు. మహిళలంతా ఉత్సాహంగా పరీక్షలు రాశారు. 15 రోజుల్లో మహిళలందరికీ ఓపెన్ స్కూల్ నుంచి సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అత్యధికంగా పటాన్‌చెరు మండలంలో 3,878 మంది మహిళలు పరీక్ష రాశారు.  ఓపెన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ సంస్థ ప్రశ్న పత్రాలు అందిచ్చిందగా, డీఆర్డీవో, సాక్షరభారత్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు.