పండగ విషాదం.. పతంగి ఎగరేస్తూ కిందపడి వ్యక్తి మృతి..

 పతంగులు ఎగురవేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని పెద్దలు చెప్తున్నా పిల్లలు పట్టించుకోరు. పండగ హడావిడిలో వుండి పోటాపోటీగా పతంగులు ఎగురవేస్తుంటారు. పదునైన మాంజాలు వాడొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పతంగులు ఎగురవేసే క్రమంలో బంగళాల మీదకు ఎక్కి పతంగులు ఎగరవేయడం చాలా ప్రమాదకరం అని తెలిసినా కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుండగా… ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు.ఈ ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Telugu news Sankranthi tragedy… The kites are falling down and the man dies .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన సయ్యద్ ముక్తార్  స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు ఇమ్రాన్ అలియాస్ ఖలీద్ (27) తండ్రితో కలిసి అదే వ్యాపారం చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఖలీద్ తన ఇంటి రెండో అంతస్తులో స్నేహితులతో కలసి పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో ఖలీద్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖలీద్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telugu news Sankranthi tragedy… The kites are falling down and the man dies.