mictv telugu

సంక్రాంతి సంబరాల్లో విదేశీ మహిళలు…

January 13, 2019

సంక్రాంతి పండగను మనం మాత్రమే జరుపుకోవడం కాదు విదేశీయులు కూడా జరుపుకున్నారు. అందంగా రంగుల ముగ్గులు వేశారు. పిండి వంటలు చేశారు. పతంగులు ఎగురవేశారు. ఈ వినూత్నమైన, అందమైన దృశ్యం వరంగల్‌లో చోటు చేసుకుంది. వరంగల్‌లో బాల వికాస ఆధ్వర్యంలో సామాజిక సేవా అనే సర్టిఫికేట్‌ కోర్సు కోసం వచ్చిన విదేశీ మహిళలు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కెనడా, నేపాల్‌, జాంబియా, శ్రీలంక దేశాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. వారితోపాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌ శౌరిరెడ్డి, మేనేజర్‌ సునీత పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల వారు పాల్గొంటారు. రంగవల్లులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి ఆడి పాడారు.

Telugu news Sankranthi vachindende Tummeda said foreign womens …

రకరకాల పిండివంటలు స్వయంగా చేసి రుచి చూసి ఆహా ఏమి రుచి అన్నారు. డూడూ బసవన్న పాటలు ఆలపించారు. పండగ విశిష్టతను తెలిపారు. ముగ్గులతో భూమాతను అలంకరించే విధానం తమకు నచ్చిందన్నారు. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా.. ఇంటిని అందంగా అలంకరించే కొత్త విధానం తెలుసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్‌ కోర్సులో భాగంగా సామాజిక సేవే కాకుండా భారత దేశంలో ఉన్న వివిధ సంస్కృతీ సంప్రదాయల గురించి కూడా వారు తెలుసుకున్నారు. Telugu news Sankranthi vachindende Tummeda said foreign womens …