mictv telugu

పందెం కోళ్లు.. బావిలో పడి ఇద్దరి మృతి

January 11, 2019

సంక్రాంతి పండగ సందర్భంగా కోళ్ల పందేలకు సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాలో ఇప్పటికే సందడి మొదలైంది. కోడి పందేలకు కోర్టు అనుమతులు లేకపోయినా.. యథావిధిగా ఈ ఏడాది కూడా ఆ జోరు మొదలైపోయింది. ఎక్కడెక్కడినుంచో మాంచి పందెంకోళ్లను కొనుగోలు చేసి, బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. కోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయి. ఎక్కడెక్కడి జనాలు కోళ్లపందేలను చూడటానికి వస్తుంటారు. అపశ్రుతి చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు పోలీసులు వచ్చారని పరుగెత్తుతూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి చనిపోయారు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.Telugu news Sankranti tragedy… Two betting managers killedచాట్రాయి మండలం చిత్తపూరులో గురువారం అర్థరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు నిర్వహిస్తున్న ఓ ముఠాపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి పరుగందకున్నారు కోడి పందేల నిర్వాహకులు. ఈ క్రమంలో  ప్రమాదవశాత్తు నేలబావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఇద్దరిని కొండపర్వకు చెందిన కుక్కల చెన్నకేశ్వరరావు(26), చిట్టూరి శ్రీనివాసరావు(20)లుగా గుర్తించారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఇరు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.