శశికళ భర్త కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

శశికళ భర్త కన్నుమూత

March 20, 2018

శశికళ భర్త ఎం.నటరాజన్ (75) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యతో రెండు వారాల కిత్రం చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే. భర్త ఆరోగ్యం క్షీణించటంతో భర్తను చూసేందుకు శశికళ ఇప్పటికే పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఆమెకు పెరోల్ మంజూరు చేస్తున్నట్టు  న్యాయమూర్తి తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఆమె జైలు నుంచి బయటకు వస్తుంది. అక్కడినుండి నేరుగా చెన్నై చేరుకుంటారని, రేపు తంజావూరులో జరిగే భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుస్తోంది. నటరాజన్‌ను 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. ఆయన డీఎంకేలో కీలక పాత్ర పోషించారు. జయలలితకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు.