రోడ్డుపై దంపతుల డ్యాన్స్..   సౌదీ రాజు గుస్సా! - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై దంపతుల డ్యాన్స్..   సౌదీ రాజు గుస్సా!

February 3, 2018

సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో  తెలిసిందే. అక్కడ మహిళలు బయట బురఖాలు లేకుండా కనిపించ కూడదు.  బహిరంగంగా మందు తాగితే  కొరడా దెబ్బలు.  తప్పు చేసినట్టు నేరం రుజువైతే  తల నరకడాలు. సినిమాలు చూడడం ఇస్లాం మతంకు వ్యతిరేకం అని అక్కడ సినిమా హాళ్లు కూడా ఉండవు. ఇంతటి  కఠిన నిర్ణయాలు ఉన్న సౌదీలో బహిరంగంగా రోడ్డుపై డ్యాన్స్ చేస్తే ఊరుకుంటారా ? 

సౌదీలోని అభా సిటీలో  భార్య భర్తలు  రోడ్డుపై  కారు ఆపి మరీ  బహిరంగంగా ఎంతో ప్రేమగా డ్యాన్స్ చేశారు.  కానీ అక్కడ  బహిరంగంగా డ్యాన్స్ చేయడం నిషిద్ధం. వాళ్లు అలా డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతూ  వీడియోలు తీశారు. ఆ డ్యాన్స్ ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే  వాళ్లు అలా డ్యాన్స్ చేయడంపై  సౌదీ రాజు  ఆగ్రహం వ్యక్తం చేస్తూ  విచారణకు ఆదేశించారు.చట్టాల ప్రకారం వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మరి వాళ్లను  గుర్తించి ఏ శిక్ష వేస్తారో చూడాలి.  

గతంలో కూడా  ఇలాగే ఓ వ్యక్తి  రోడ్డుపై డ్యాన్స్ చేస్తే  తీసుకెళ్లి కటకటాల్లో  పెట్టారు.  సౌదీలో ఉన్న కఠిన నిర్ణయాలలో ఇప్పుడిప్పుడే  కొన్ని మార్పులు చేస్తున్నారు.  మహిళలు  డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేదాన్ని ఈ మధ్యే అక్కడ ఎత్తి వేశారు. దీనితో అక్కడి ఆడవాళ్లు  సంతోషం వ్యక్తం  చేశారు. ఇంకా కొన్ని నియమాల్లో మార్పులు చేసేందుకు  సౌదీ ప్రభుత్వం  ఆలోచనలో ఉంది.