మా దేశానికి పంపిస్తే నన్ను చంపేస్తారు… సౌదీ టీనేజర్

‘నన్ను మా దేశానికి పంపొద్దు. నేను ఇస్లాంను విడిచిపెట్టాను’ అంటూ ఓ 18 ఏళ్ల  రాహ‌ఫ్ మొహమ్మద్ ముత్‌లాఖ్ అల్‌కున‌న్ అనే సౌదీ అరేబియాకు చెందిన టీనేజ్ అమ్మాయి కోరుతోంది. ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో వుంది. కువైట్‌లో ఉన్న త‌న తల్లిదండ్రుల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఆమె థాయిలాండ్ చేరుకుంది. అయితే బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను ఓ హోట‌ల్‌లో బంధించారు. ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా థాయ్‌కు వెళ్లిన కారణంగా ఆమెను అక్క‌డి అధికారులు అరెస్టు చేశారు.  తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కానీ రాహఫ్ చచ్చినా తన దేశానికి వెళ్లనని ఖరాఖండిగా చెబుతోంది.Telugu news Saudi girl hopes for Aussie refugees But without a visa – arrested in Suvarnabhumi Killed If sent home‘నేను ఇస్లామ్‌ను వ‌దిలివేశాన‌ు. ఇస్లాంను విడిచి వెళ్లినవాళ్ళను మా దేశంలో కఠినంగా శిక్షిస్తారు. కుటుంబ‌స‌భ్యుల‌తో నాకు ప్రాణహాని ఉంది. అందుకే ఆస్ట్రేలియా పారిపోతున్న‌ాను. ఏ దేశ‌మైనా నాకు ఆశ్ర‌యం క‌ల్పిస్తే అక్క‌డ‌కి వెళ్తాన‌ు’ అని ఆమె ఓ వీడియో సందేశంలో చెప్పింది. ఆ త‌ర్వాత సౌదీ ఎంబీసీ అధికారులు ఆమెను ఆధీనంలోకి తీసుకున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న‌కు ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని కోరుతోంది. గ‌తేడాది ఆరంభంలో కూడా ఓ మ‌హిళ ఇలాగే కెన‌డాకు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించింది. ఆమెను పిలిప్పీన్స్ నుంచి కువైట్‌కు పంపించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మ‌హిళ ఆచూకీ తెలియ‌లేదు. ఈ క్రమంలో రాహఫ్ భవిష్యత్తుపై కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మేజర్ కావడంతో తన నిర్ణయానికి వదిలేయ్యాలా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు అధికారులు.Telugu news Saudi girl hopes for Aussie refugees But without a visa – arrested in Suvarnabhumi Killed If sent home