సావిత్రి ఎత్తుకున్న బాబు ఇప్పటి స్టార్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

సావిత్రి ఎత్తుకున్న బాబు ఇప్పటి స్టార్ హీరో

April 18, 2018

మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ మహానటి ’ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి నెలకొని వుంది. సావిత్రి జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా గురించి చాలా అంచనాలు నెలకొని వున్నాయి. కాగా సావిత్రికి సంబంధించి కొన్ని అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఫోటోలో సావిత్రి చిన్న బాబును ఎత్తుకుని వుంది. ఆ ఫోటోను గౌతమ్ అనే నెటిజన్ షేర్ చేస్తూ ఈ బాల నటుడు ఇప్పటి స్టార్ హీరో నాగార్జున.. అని పోస్ట్ చేశాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ..

‘ ఆ ఫోటో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘ వెలుగు నీడలు ’ చిత్రంలోనిది. ఓ చక్కటి జ్ఞాపకాన్ని గుర్తు చేసిన గౌతమ్‌కు థాంక్స్ ’ అంటూ రీట్వీట్ చేశారు నాగార్జున.