ఎస్‌బీఐ శుభవార్త.. చార్జీలు 75 శాతం తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐ శుభవార్త.. చార్జీలు 75 శాతం తగ్గింపు

March 13, 2018

ప్రభుత్వం రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఖాతాల్లోని కనీస నిల్వలు లేకపోతే వసూలుచేసే చార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 50(జీఎస్‌టీ కాకుండా), సెమీ- అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 40(జీఎస్‌టీ కాకుండా) వసూలు చేస్తున్నారు.  మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే ఇకపై రూ. 15(జీఎస్‌టీ కాకుండా), సెమీ-అర్బన్‌ అయితే రూ. 12(జీఎస్‌టీ కాకుండా), గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలకైతే రూ. 10(జీఎస్‌టీ లేకుండా) వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ  తెలిపింది. ఈ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కనీస నిల్వల ఛార్జీల పేరుతో ఎస్‌బీఐ వేల కోట్ల ఆదాయాన్ని దండుకుంటోందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకు చార్జీల ద్వారా కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 1,771 కోట్లు గడించింది..!