ఉచిత పెట్రోల్ ఆఫర్ గడువు పొడిగించిన ఎస్‌బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

ఉచిత పెట్రోల్ ఆఫర్ గడువు పొడిగించిన ఎస్‌బీఐ

December 6, 2018

పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు కాసింత ఉరటనివ్వడానికి ఎస్‌బీఐ బ్యాంకు వివిధ కాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆఫర్‌ను మరింత పొడిగిస్తున్నట్లు తెలిపింది ఎస్‌బీఐ సంస్థ. అమల్లో ఉన్న ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను మరికొన్ని రోజులు పొడిగించింది స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంస్థ. వినియోగదారులకు 5 లీటర్ల దాకా ఉచిత పెట్రోల్‌ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15 వరకు పొడిగించినట్టు ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు లేదా, భీమ్‌ ఎస్‌బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్లలో పెట్రోల్ కొని 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందండి.Telugu News Sbi bank extended the validity of free petrol offer2018 డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్ అంటూ ట్విటర్‌ ప్రకటనలో తెలిపింది. ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్‌ బంకులోనైనా కనీసం 100 రూపాయల పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను  పంపవచ్చు. అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలి.

ఆఫర్ పొందడం ఎలా?

* ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పుంపు నుండి కనీసం రూ.100 విలువైన పెట్రోల్ లేదా డీజిల్‌ని ఎస్‌బీఐ కార్డు లేదా భీం ఆప్ ద్వారా కొనుగోలు చేయాలి.

* 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెల అధికార కోడ్‌ను 9222222084కు ఎస్‌ఎంఎస్ చేయాలి.

* భీమ్‌ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్‌ , ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లిస్తే 6 అంకెల కోడ్‌ వస్తుంది. దానిని నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి వుటుంది.

అంతేకాదు ఇలా అందిన ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి 50, 100, 150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ప్రచారకాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండుసార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం వుంది. ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు.