41 లక్షల ఖాతాలను మూసేసిన ఎస్‌బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

41 లక్షల ఖాతాలను మూసేసిన ఎస్‌బీఐ

March 14, 2018

ఎస్‌బీఐ ఒక్కసారిగా 41.61 లక్షల ఖాతాలను మూసివేసింది. అదేంటని సమాచార హక్కులో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేదన్న ఒకే ఒక్క కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) వెల్లడించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఎస్‌బీఐ ఈ వివరాలను తెలియజేస్తూ ఆయనకు లేఖ రాసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 41 లక్షలకు పైగా ఖాతాలను మూసివేసినట్టు అందులో పేర్కొంది. 2017-18 తొలి 8 నెలల్లో సగటు నగదు నిల్వలేని ఖాతాల నుంచి ఎస్‌బీఐ ఏకంగా రూ.1,777.67 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేకుంటే విధించే జరిమానా చార్జీలను 75 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ మంగళవారం ప్రకటించి, అదేరోజు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.