డిపాజిటర్లకు ఎస్బీఐ శుభవార్త.. వడ్డీ పెరిగింది.. - MicTv.in - Telugu News
mictv telugu

డిపాజిటర్లకు ఎస్బీఐ శుభవార్త.. వడ్డీ పెరిగింది..

February 28, 2018

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ  తన ఖాతాదారులు వ‌డ్డీ రేట్లు త‌క్కువ అవుతున్నాయ‌ని నిరాశ చెందుతున్న క్రమంలో వారి కోసం ఓ శుభవార్త చెప్పింది. రిటైల్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల మేర  వడ్డీరేటును పెంచింది.

ఈ మేరకు బుధవారం వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు  5.25 శాతం, వార్షిక వడ్డీరేటు 6.40 శాతం వుంది. ఇప్పటివరకు ఇది 6.25 శాతంగా ఉండేది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల‌ప‌రిమితి ఉండే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. ఇప్పటివరకూ ఇది 6శాతం. కోటి రూపాయల డిపాజిట్లపైన కూడా వడ్డీరేటును పెంచనుంది.

ఇంతకుముందు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీరేటు వుండేది. ఇకనుంచి వారికి 7 శాతం వడ్డీ అమలు కానుంది. పెంచిన ఈ వడ్డీరేట్లు కొత్తగా చేసే డిపాజిట్లకు, రెన్యువల్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుందని తన నోటిఫికేషన్‌లో తెలిపింది. రుణాలపై కూడా భారీగా వడ్డీరేట్లను పెంచుతేందేమోనని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుణాల‌పై త‌గ్గించిన వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందేలా చూడాల‌ని రిజ‌ర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకుల‌ను కోరింది. ఎంసీఎల్ఆర్ ఆధారిత వ‌డ్డీ రేట్ల‌ను అమ‌లు చేయ‌కుండా జాప్యం చేస్తున్న నేప‌థ్యంలో ఆర్బీఐ ఈ విధంగా స్పందించ‌వ‌ల‌సి వ‌చ్చిందంటున్నారు నిపుణులు.